Minister Errabelli went fishing for a meanwhile in his busy schedule. After participating in various programs in Palakurti | తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అటు మంత్రిగా వివిధ కార్యక్రమాలలో బిజీగా ఉంటూనే, మరోపక్క జనంతో మమేకం అయ్యేలా అనేక పనులు చేస్తుంటారు. గతంలో అనేక మార్లు కార్యక్రమాలలో భాగంగా వెళుతున్న క్రమంలో రోడ్డు పక్కన ఆగి వ్యవసాయ పనులు చేసుకునే మహిళలతో మాట్లాడి, వారితో కలిసి భోజనం చేసిన మంత్రి ఎర్రబెల్లి, గిరిజన లంబాడి మహిళలతో కలిసి డాన్సులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక తాజాగా బిజీ షెడ్యూల్లో ఉన్న మంత్రి ఎర్రబెల్లి ఆటవిడుపుగా పాలకుర్తి నియోజకవర్గ పర్యటన ముగించుకొని వరంగల్ వెళుతున్న క్రమంలో దారిలో వాగులో గాలమేసి చేపల వేట సాగించారు. ఈ సరదా సన్నివేశానికి అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు.
#Telangana
#ErrabelliDayakar
#TRS
#Palakurti